కామన్వెల్త్ లో వెయిట్ లిఫ్టర్ల జోరు: భారత్ కు మరో గోల్డ్ మెడల్

poonamఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్టులో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. వెయిట్ లిఫ్టింగ్ లో మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. ఆదివారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ లోవారణాసికి చెందిన పూనం యాదవ్ 69 కేజీల విభాగంలో 222 బరువునెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటి వరకు భారత్ కు వచ్చిన స్వర్ణాలన్నీ వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చినవే కావడం విశేషం.

భారత పతకాల సంఖ్య ఏడుకు చేరగా.. అందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates