కామన్‌ వెల్త్ గేమ్స్‌ : షూటర్ హీనాకు గోల్డ్

heenaకామన్‌ వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు రఫాడిస్తున్నారు. షూటింగ్ విభాగంలో మంగళవారం (ఏప్రిల్-10) ఇండియాకు మరో గోల్డ్ దక్కింది. మహిళల 25మీ పిస్తోల్ ఈవెంట్‌ లో షూటర్ హీనా సిధూ స్వర్ణ పతకం గెలుచుకుంది. దీంతో కామన్‌వెల్త్‌ లో భారత్ గెలుచుకున్న బంగారు పతకాల సంఖ్య 11కు చేరుకున్నది. ఈ గేమ్స్‌ లో హీనాకు ఇది రెండ‌వ మెడ‌ల్ కావ‌డం విశేషం. 10మీ ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌ లో హీనాకు సిల్వ‌ర్ ప‌త‌కం ద‌క్కింది. ఇవాళ జ‌రిగిన 25మీ పిస్తోల్ ఈవెంట్‌ లో ఆస్ట్రేలియాకు చెందిన ఎలినా గ‌లియ‌బోవిచ్ రెండ‌వ స్థానంలో నిలిచింది. ఇక కాంస్య ప‌త‌కాన్ని మ‌లేషియాకు చెందిన అలియా స‌జానా అజ‌హ‌రి గెలుపొందింది.

Posted in Uncategorized

Latest Updates