కామన్ వెల్త్ గేమ్స్ : మేరీకోమ్ కు గోల్డ్

MERIఅయిదు నెలల క్రితం ఆసియా చాంపియన్‌ షిప్‌ ను గెలుచుకున్న మేరీ.. అదే దూకుడును ఇక్కడా ప్రదర్శించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ బౌట్‌లో చెలరేగిన తీరు అందర్నీ ఆకట్టుకున్నది. మేరీ సాధించిన పతకంతో భారత్ ఖాతాలో 18వ గోల్డ్ మెడల్ చేరింది. ఇటీవల బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లోనూ మేరీ సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో పాటు అయిదుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిళ్లు మేరీ ఖాతాలో ఉన్నాయి. మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ ఫిల్మ్ రిలీజైన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates