కామన్ వెల్త్ గేమ్స్ : రెజ్లింగ్‌ లో భజరంగ్ కు గోల్డ్

GOLD CWGకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణ పతకాల వేట కొనసాగుతున్నది. రెజ్లింగ్‌లో మరో గోల్డ్ మెడల్ భారత్ సొంతమైంది. 65 కేజీల పిస్టెల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన భజరంగ్ పూనియా గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో వేల్స్‌ కు చెందిన కేన్ చరిగ్‌ పై 10-0తో సునాయాసంగా గెలిచాడు. ఈ మెడల్‌ తో భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్స్ సంఖ్య 17కు చేరింది. 9వ రోజే మూడు గోల్డ్ మెడల్స్ రావడం విశేషం. షూటింగ్‌ లో తేజస్విని, అనీష్ భన్వాలా గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. 17 గోల్డ్ మెడల్స్‌ తో పాటు 8 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్‌ తో మొత్తం 36 పతకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates