కామన్ వెల్త్ గేమ్స్ : రెజ్లింగ్ లో రాహుల్ కు గోల్డ్

RAHUL AWAREకామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. గురువారం (ఏప్రిల్-12) రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీైస్టెల్ ఈవెంట్‌ లో భారత్‌కు చెందిన రాహుల్ ఆవారె స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో కెనడాకు చెందిన స్టీవెన్ తకహషిపై 15-7 తేడాతో గెలిచాడు రాహుల్. మ్యాచ్ మొత్తాన్ని రాహుల్ డామినేట్ చేశాడు. తొలి పీరియడ్‌లో 6-4, రెండో పీరియడ్ తర్వాత 9-6తో లీడ్‌ లో ఉన్న రాహుల్.. చివరి పీరియడ్‌ లో మరింత చెలరేగి 15-7తో మ్యాచ్ గెలిచాడు. ఈ సందర్భంగా రాహుల్ కు అభినందనలు తెలిపారు ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్. ఇండియాకు ఇది 13వ గోల్డ్ మెడల్. మొత్తంగా 27 పతకాలతో భారత్ మూడోస్థానంలో కొనసాగుతున్నది.

Posted in Uncategorized

Latest Updates