కామన్ వెల్త్ గేమ్స్ : ర్యాపిడ్ ఫైర్ లో అనీష్ కు గోల్డ్

goldకామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ మెడల్స్ తో సత్తా చాటుతోంది. శుక్రవారం (ఏప్రిల్-13) పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో గెలిచిన 15 ఏళ్ల అనీష్ భన్వాలా.. భారత్ కు స్వర్ణం తెచ్చాడు. అలాగే మహిళల 50 మీటర్ల ఈ పోజిషన్స్‌ విభాగంలో తేజస్విని సావంత్‌ గోల్డ్ మెడల్ సాధించింది. ఇదే విభాగంలో అంజుమ్‌ మోద్గిల్‌ సిల్వర్ మెడల్ సాధించింది. ప్రస్తుతం భారత్‌ 16 గోల్డ్, 8 సిల్వర్, 10 కాంస్యాలతో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates