కామన్ వెల్త్ గేమ్స్ : షూటింగ్ లో తేజస్వినికి సిల్వర్

TEJASWINI SAWANTకామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు 25వ మెడల్ వచ్చింది. షూటింగ్ విభాగంలో భారత్‌ కు మరో పతకం దక్కింది. మహిళల 50మీ రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌ లో తేజస్విని సావంత్ సిల్వర్ మెడల్ గెలిచింది. రైఫిల్ ప్రోన్ ఫైనల్స్‌ లో తేజస్విని 618.9 పాయింట్లు స్కోర్ చేసింది. దీంతో కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 25కు చేరుకున్నది. 50మీ రైఫిల్ ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారతీయ ప్లేయర్ అంజుమ్ మౌద్గిల్ మెడల్ ఆశలను గల్లంతు చేసింది. ఇప్పటి వరకు భారత్ 12 స్వర్ణ, 5 రజత, 8 కాంస్య పతకాలను గెలుచుకున్నది.

Posted in Uncategorized

Latest Updates