కామన్ వెల్త్ లో భారత్ జయహో : వెయిట్ లిఫ్టింగ్ లో ఛానుకి గోల్డ్

MirabaiChanuగోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్  గేమ్స్ లో ఫస్ట్ డే భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ స్నాచ్ విభాగంలో 86 కేజీల బరువు ఎత్తిన మీరాబాయి ఛాను.. కామన్వెల్త్ చరిత్రలోనే ఓ కొత్త రికార్డును సృష్టించింది. అన్ని విభాగాల్లో సత్తా చాటి (86+110) ఈ సీజన్ లో భారత్ కు ఫస్ట్ గొల్డ్ మెడల్ ని అందించింది.  22ఏళ్ల అనంతరం కరణం మల్లీశ్వరీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత అమ్మాయి చానునే కావడం విశేషం.

అంత‌కుముందు పురుషుల 56 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజా రజతం సొంతం చేసుకున్నాడు. భార‌త్‌కు తొలి ప‌త‌కం సాధించాడు. మారిషియన్‌ వెయిట్‌ లిఫ్టర్‌ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో  శ్రీలంక లిఫ్టర్‌ దినుషా గోమ్స్‌ కాంస్య పతకంతో సంతృప్తి పడింది.

Posted in Uncategorized

Latest Updates