కామన్ వెల్త్ హాకీలో సెమీస్ కు చేరిన భారత్

hockeyకామన్‌వెల్త్ పురుషుల హాకీలో ఇండియన్ టీమ్ సెమీస్‌కు చేరుకున్నది. పూల్ బి మ్యాచ్‌లో ఇవాళ భారత్ 2-1 గోల్స్ తేడాతో మలేషియాపై విజయం సాధించింది. డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. అతను ఆట ప్రారంభమైన 3వ నిమిషంలో మొదటి గోల్ చేయగా, మళ్లీ 44వ నిమిషంలో మరో గోల్ చేశాడు. పెనాల్టీ కార్నర్ల నుంచే ఆ గోల్స్ చేశాడతను. మలేషియా టీమ్‌లో ఫైజల్ సారి 16వ నిమిషంలో గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. ఆట ప్రారంభమైన రెండు నిమిషాలకు భారత్‌కు పెనాల్టీ వచ్చింది. దాన్ని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచాడు. మలేషియాకు కూడా ఆరవ నిమిషంలో పెనాల్టీ వచ్చినా.. దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు. వరణ్ కుమార్, మన్‌దీప్‌లు పెనాల్టీ కార్నర్లను మిస్ చేశారు. సెకండ్‌హాఫ్‌లో మలేషియా దూకుడుగా ఆడింది. కానీ గోల్ కీపర్ పీఆర్ రాజేష్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయిన లాభం లేకుండా పోయింది. మలేషియాపై ఘన విజయం సాధించి సెమీ ఫైనల్ కు చేరుకుంది భారత్.

Posted in Uncategorized

Latest Updates