కామన్ వెల్త్-2018 : మహిళల ఘూటింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్

PAPAగోల్డ్‌ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2018లో ఈ రోజు భారత్ మరో స్వర్ణ పతాకాన్ని గెల్చుకుంది. భారత షూటర్ శ్రేయసి సింగ్‌ డబుల్‌ ట్రాప్‌ మహిళల షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించింది. నాలుగు రౌండ్ల పాటు శ్రేయసి సింగ్‌, ఆస్ట్రేలియా షూటర్  ఎమ్మా కాక్స్‌ల మధ్య పోటీ జరగ్గా 96 పాయింట్లతో ఇద్దరూ సమానంగా నిలిచారు. దీంతో మళ్లీ వీళ్లిద్దరూ షూటాఫ్‌ కి వెల్లవలసి వచ్చింది. ఈ సమయంలో రెండు సార్లు భారత షూటర్ శ్రేయసి సింగ్ టార్గెట్‌ని హిట్ చేయగా,ఎమ్మా మాత్రం రెండు షూట్లలో ఒక్కటే హిట్ సాధించింది. నాలుగురౌండ్లలో  87 పాయింట్ల సాధించి కాంస్య పతాకాన్ని దక్కించుకొంది స్కాట్‌లాండ్‌కి చెందిన లిండా పియర్సన్‌. ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో ఇప్పటి వరకూ భారత్ 12 గోల్డ్ మెడల్స్ దక్కించుకుంది.

 

Posted in Uncategorized

Latest Updates