కామన్ వెల్త్-2018 : స్క్వాష్ ఈవెంట్ లో భారత్ కు సిల్వర్

స్క్వాష్ ఈవెంట్ లోనూ భారత్ కు మరో సిల్వర్ దక్కింది. దీపిక పల్లికాల్, జోష్నాచినప్ప జోడీ.. న్యూజీలాండ్ జంట కింగ్, ముర్ఫీ చేతిలో ఓడిపోయింది. ఇవాళ భారత్ ఖాతాలో చేరిన మూడో వెండి పతకం ఇది.

బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్ ఫైనల్లోనూ భారత్ కు వెండి పతకం దక్కింది. ఇంగ్లీష్ జంటపై ఓడిపోవడంతో.. సాత్విక్ రంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిల జోడీకి సిల్వర్ మెడల్ అందింది.

టేబుల్ టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో ఇండియాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. జ్ఞానశేఖరన్, మనికా బత్రా జోడీ.. టేబుల్ టెన్నిస్ లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇదే గేమ్ లో.. మెన్స్ సింగిల్స్ లో భారత్ కు కాంస్యం దక్కింది. శరత్ కమల్ ముద్దాడిన బ్రాంజ్ మెడల్.. టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో ఏడవది. కామన్వెల్త్ హిస్టరీలోనే టేబుల్ టెన్నిస్ లో ఈసారి ఎక్కువ పతకాలు వచ్చాయి.

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ లో.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అన్నింటినీ సాధించింది. ఏప్రిల్ 8న జరిగిన మ్యాచ్ లో గోల్డ్ మెడల్… ఏప్రిల్ 13న జరిగిన ఉమెన్స్ డబుల్స్ ఈవెంట్ లో రజత పతకం…. నిన్న జరిగిన ఉమెన్స్ సింగిల్స్ లో బంగారు పతకం ముద్దాడింది. ఇవాళ మిక్సుడ్ డబుల్స్ లోనూ కాంస్యపతకం గెల్చుకున్న భారతీయ క్రీడాకారిణిగా తన ప్రత్యేకతను నిరూపించుకుంది.

Posted in Uncategorized

Latest Updates