కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా..పలువురికి తీవ్ర గాయాలు

కామారెడ్డి: జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో ఇవాళ డిసెంబర్-10న ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్టీరింగ్ లాక్ అవడంతో బస్సు అదుపు తప్పి బోల్తో కొట్టినట్టు తెలిపాడు బస్సు డ్రైవర్.  బస్సు బోధన్ నుంచి బాన్సువాడకు వెళ్తుండగా ప్రమాదం జరగగా.. బస్సు ధ్వంసమైంద. మిగితా ప్రయాణికులు సురక్షితంగా బస్సు నుంచి బయటపడ్డారు. బస్సులో ఎక్కువ మందిలేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates