కారుని విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్

starman live view falcon heavy spacexఅత్యంత శక్తివంతమైన ఫాల్కన్ హెవీ రాకెట్‌ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 18, 747 జెట్‌ లైనర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్‌.. టెస్లా రోడ్‌స్టర్‌ కారును కూడా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్‌ ఎక్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది. 27 ఇంజిన్ లతో ఈ  ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ చేసిన శబ్దానికి ఫ్లారిడా స్పేస్‌ కోస్ట్‌ కంపించిపోయింది. చంద్రుడిపైకి అపోలో 11 అంతరిక్ష వ్యోమ నౌకను ప్రయోగించిన లాంచ్‌పాడ్‌ నుంచి ఈ ప్రయోగం చేశారు శాస్త్రవేత్తలు. రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించే సమయంలో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్‌ హెవీని మూడు ఫాల్కన్‌ 9 రాకెట్లను కలిపి తయారుచేశారు. ఫాల్కన్‌ హెవీ అత్యధికంగా 1,41, 000 పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు.

Posted in Uncategorized

Latest Updates