కారును ఢీకొట్టేదెవరు?

టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతుంటే మహాకూటమి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. కొత్తగూడెం, పినపాక, ఇల్లెం దు, అశ్వారా వుపేట నుంచి సిట్టిం గ్‌ లకే టీఆర్‌‌ఎస్‌ టికెట్లు కేటాయించిం ది. దీంతో జిల్లాలో టీఆర్‍ఎస్‍ను ఢీ కొనేదెవరంటూ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. టీఆర్‍ఎస్‍ తరఫున ఆ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్ నారు.కూటమిలోని కాంగ్రెస్‍, సీపీఐ నేతలు అధిష్టానాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.పోటాపోటీ సిట్టిం గు స్థానాలను దక్కించుకోవాలని టీఆర్‍ఎస్‍,మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కూట మిలోని పార్టీలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి.

టీఆర్‍ఎస్‍ అభ్యర్థులు రెం డు నెలలుగా ప్రచారంలో ఉండగా కూటమి అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్‍ఎస్‍ను ఢీకొట్టే అభ్యర్థులు ఎవరా అనే ప్రశ్న అటు ఆయా పార్టీలతో పాటు ప్రజల మెదళ్లను తొలుస్తోంది. జిల్లాలో బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలను పన్నుతోం ది. జిల్లాలోని సిట్టింగ్‍ స్థానాన్ని నిలబెట్టుకుని తమ సత్తా చాటేందుకు సీపీఎం సర్వశక్తులను ఒడ్డుతోంది. టీఆర్‍ఎస్‍కు అసమ్మతి తలనొప్పి జిల్లాలో టీఆర్‍ఎస్‍కు అసమ్మతి తలనొప్పిగా మారింది. మరోవైపు కొత్తగూడెం, పినపాక. ఇల్లెందు, అశ్వారా వుపేట నియోజకవర్గాల్లో ప్రజలు తమకేంచేశారంటూ అభ్యర్థులను నిలదీస్తు న్న దాఖలాలున్నాయి. జిల్లాల్లో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటివర్గాలున్నాయి. జలగం వెంకట్రావ్‍ తానే ఓ వర్గంగా ఉంటున్ నారు. ఇల్లెం దులో తమకు పార్టీ అన్యాయం చేసిందంటూ ఆ పార్టీ నియోజకవర్గ సీనియర్‍ నేత దేవీలాల్‍ నాయక్‍ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తా నని బహిరంగంగానే హెచ్చరిస్తున్ నారు. అశ్వారావుపేటలో అసమ్మతి నేతలు ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు.

కాంగ్రెస్‍లోని అసమ్మతి నేతల ఓట్లను ఆయన ఆకర్షించే అవకాశాలున్నాయి.కాం గ్రెస్‌ లో గ్రూపుల పోరు కాంగ్రెస్‌లో గ్రూపుల పోరు తారాస్థా యిలో ఉంది.జిల్లాలో పార్టీ రాష్ట్ర నేతలు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి గ్రూపులున్నాయి. ఏఐసీసీ నియమించిన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాఇన్‌చార్జి సలీం అహ్మద్‌ ఖమ్మంలో రెం డు రోజులపాటు ఉండి నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పలుమార్లు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఎవరికి వారు తమ ముఖ్య నేతల ద్వారా మంత్రాంగం నడుపుతున్నారు. కూటమి తరఫున కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో మరో నాలుగైదు రోజుల్లో తేలనుంది. ఆశల పల్లకిలో టీడీపీ జిల్లాల్లో టీడీపీకి బలమైన కార్యకర్తలున్నారు. కాగా టీడీపీ నుంచి పలువురు నేతలు టీఆర్‍ఎస్‍లో చేరారు. మరికొందరు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. జిల్లా

పునర్విభజన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కోనేరు సత్యనారాయణ(చిన్ని )ను పార్టీ నియమించింది. కొత్తగూడెం, అశ్వారా వుపేట నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నేతలు పావులు కదుపుతున్నారు.కొత్తగూడెం, భద్రాచలంపై కమ్యూనిస్టుల దృష్టి కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలపైనే కమ్యూనిస్టులు ప్రధానంగా దృష్టి సారించారు.సిట్టింగ్‍ స్థానమైన భద్రాచలంపై సీపీఎం గురిపెట్టిం ది. ఈసారి కూడా భద్రాచలంలో ఎర్రజెండా ఎగరువేసేందుకు ముమ్మరంగా ప్రచారం కొనసా-
గిస్తోంది. కొత్తగూడాన్ని వదులుకునేదే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ప్రధానంగా ఇల్లెం దు నుంచి సీపీఐ ఎంఎల్‍ న్యూడె మోక్రసీలోని రాయల, పెద్ద చంద్ర న్న వర్గాలు బరిలో ఉన్నాయి. ఇల్లెం దు, కొత్తగూడెం, అశ్వారా –
వుట నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఏడాది కిందట రెం డు రోజులపాటు భద్రాచలంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. ఇక వైఎస్సార్‍ కాంగ్రెస్‍,జనసేన, తెలంగాణ జన సమితి తదితర పార్టీలు
తమ కార్యా చరణకు పార్టీ అగ్రనేతలతో సమావేశం అవుతున్నారు. ఆమ్‍ఆద్మీ తరఫున కొత్తగూడెం నుంచి సతీశ్‌‌ అనే దివ్యాంగుడు బరిలో నిలిచారు.

Latest Updates