కారులోకి రెండు చిరుతలు.. టెక్నిక్ గా బయటపడ్డాడు

CHIRUTHA IN CARచిరుతను చూస్తేనే భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది పక్కనే ఉంటే.. గుండే ఆగిపోతుంది. అయితే గైడ్ సూచనలతో కారులోకి వచ్చిన చిరుత నుండి తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. సఫారీకి వెళ్లి జంతువులను దగ్గరగా చూసి రావాలనుకున్న ఓ వ్యక్తికి అనుకున్నదాని కన్నా ఎక్కువ జరిగింది. అమెరికాలోని సీటెల్‌కు చెందిన బ్రిట్టన్‌ హెయెస్‌ టాంజానియాలో సెరెంగెతీ జాతీయ పార్కులో సఫారీ టూర్‌కు వెళ్లాడు.

జీపులో సఫారీలోకి ప్రవేశించిన హెయెస్‌.. వాహనాన్ని ఒక చోటు నిలిపి చిరుతలను చూస్తున్నారు. ఇంతలో జీపు వైపునకు రెండు చిరుతలు దూసుకొచ్చాయి. వాటిలో ఒకటి కారుపైకి ఎక్కగా.. మరొకటి కారు వెనుక డోర్‌లో నుంచి లోపలికి వెళ్లింది. దీంతో కారులో ఉన్న హెయెస్‌ హడలిపోయాడు. పక్క కారులో ఉన్న టూరిస్ట్‌ గైడ్‌ సూచనలతో కదలకుండా అలానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. శ్వాస వేగాన్ని కూడా నియంత్రించుకున్నాడు. కాసేపు కారులోపలే ఉన్న చిరుత దాన్నుంచి బయటకు వెళ్లింది. ఈ సంఘటనపై మాట్లాడుతూ.. చిరుత జీపులోకి ప్రవేశించగానే ఒక్క క్షణం తన గుండె ఆగిపోయినట్లు అనిపించిందని చెప్పాడు హెయెస్‌. ప్రస్తుతం  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates