కారులో పెట్టుకుని వెళ్లొచ్చు : ప్రపంచంలోనే చిన్న రాకెట్

japanఅంతరిక్ష నౌకా ప్రయోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది జపాన్. శాటిలైట్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే చిన్న రాకెట్‌ను తయారు చేశారు జపాన్ శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి చిన్న రాకెట్. శనివారం(ఫిబ్రవరి3) కగోషిమా ప్రాంతంలోని ఉచినోపురా స్పేస్ సెంటర్ నుండి శాస్త్రవేత్తలు ఈ చిన్న రాకెట్ సాయంతో మైక్రో శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టగలిగారు. ఎస్‌ఎస్-520 రాకెట్ ముక్కు భాగంలో థర్డ్ స్టేజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, 13.6 అంగుళాల పొడవు గల మూడు దశల క్యూబ్ శాట్ ట్రైకామ్-1ఆర్ ను అంతరిక్షంలోకి పంపడంలో సక్సెస్ అయ్యారు. లాంచింగ్ ప్యాడ్ ప్రదేశానికి తరలించేందుకు భారీ వాహనం కాకుండా కారు వెనుక సీటులో తరలించారు. అత్యంత చిన్న రాకెట్ గా ఇది ప్రపంచంలోనే ప్రత్యకత సంతరించుకుంది.

Posted in Uncategorized

Latest Updates