కారు అతివేగం.. బైక్ పై వెళ్తున్న ఇంజినీరింగ్ స్టూడెంట్ బలి

రంగారెడ్డి జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డుపై అతివేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది.  వేగంగా వచ్చిన కారు… అదుపు తప్పి రెండు బైకులని ఢీ కొట్టింది. బైక్ పై వెళ్తున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు బైకులపై ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దగ్గర్లోని హాస్పిటల్ కు బాధితులను చేర్చారు స్థానికులు. కారు ముందు భాగం… ఓ బైకు ముందుభాగం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు బైక్ ను ఢీకొట్టి.. రోడ్డు పక్కకు పోయింది.

Posted in Uncategorized

Latest Updates