కారు ఆపలేదు. పోలీసులపైకే ఎక్కించాడు

గురుగ్రామ్‌ : పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి అతి తెలివి చూపించాడు. కారును రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తూ..పోలీసులకు చుక్కలు చూపించాడు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుపైకే కారు ఎక్కించాడు. కొద్దిదూరం అలాగే కారు బానెట్ పై వేలాడాడు పోలీస్. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో డిసెంబర్ -19న జరిగింది.

గురుగ్రామ్ సిగ్నేచర్‌ టవర్‌ చౌక్‌ దగ్గర రాంగ్ రూట్ లో వస్తున్న కారును ఓ ట్రాఫిక్ పోలీసు ఆపాడు. కారు డ్రైవర్ ఆపినట్టే ఆపి, ముందుకు దూసుకుపోయాడు. ట్రాఫిక్ పోలీస్ పైకి ఎక్కించినంత పనిచేశాడు. కారు ముందే ఉన్న పోలీస్.. బ్యానెట్ ను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. కొంచెం దూరం అలాగే ముందుకు పోనిచ్చాడు ఆ డ్రైవర్. భయంతో అరుస్తున్న పోలీసును చూసి కారును ఆపాడు. దీనిపై సీరియస్ అయిన పోలీసులు… కారు డ్రైవర్ ను అరెస్టు చేసి, కారును సీజ్ చేశారు. కారు నడిపిన వ్యక్తి ఎవరన్నది విచారిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ సీన్ మొత్తాన్ని.. పక్కన ఉన్నవాళ్లు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates