కార్గిల్‍లో టెంపరేచర్‍ మైనస్‍ 19డిగ్రీలు

కశ్మీర్‍లో చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కశ్మీర్‍ వ్యాలీ, లడఖ్ రీజియన్‍లో పహల్గాం మినహా మిగతా చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు మైనస్‍ డిగ్రీలకు పడిపోయినట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రీజియన్‍లోనే అత్యంత తక్కువగా కార్గిల్‍ జిల్లాలోని డ్రాస్‍లో మైనస్‍19.7 డిగ్రీల రికార్డు టెంపరేచర్‍ నమోదైంది. ఉత్తర కశ్మీర్‍లోని స్కై రిసార్ట్ లో మైనస్‍ 11.5, లేహ్‍లో మైనస్‍ 13.9, కార్గిల్‍ టౌన్‍లో మైనస్‍ 10.2, కుప్వారాలో మైనస్‍ 4.5 డిగ్రీ సెల్సియస్‍ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పదేళ్లలో అతి తక్కువగా దక్షిణ కశ్మీర్‍లోని కోకర్నాగ్‍లో మైనస్‍ 6.6డిగ్రీల సెల్సియస్‍గా నమోదైంది. క్వాజి గండ్‍లో మైనస్‍ 5డిగ్రీలు,పహల్‍గామ్‍ బేస్‍ క్యాంప్‍లో ఉష్ణోగ్రతలు మైనస్‍ 9.5డిగ్రీలకు పడిపోయాయి.

Posted in Uncategorized

Latest Updates