కార్మికులకు కనీస వేతనం…లేదంటే రూ.10 లక్షలు జరిమానా

కనీస వేతనం అమలుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు, సూచనలు చేసింది. అన్నిరంగాల్లో కనీస వేతనం అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ గుర్తింపుతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోనూ ఇది అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రతి సంస్థ కనీస వేతన కోడ్ అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏ సంస్థ అయినా సరే, కనీస వేతన కోడ్ అమలు చేయకుంటే 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అలాగే ఉద్యోగులతో 8 గంటలకన్నా ఎక్కువగా పనిచేయించరాని చెప్పింది. ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా.. 8 గంటలకు మించి పని చేయించుకోవద్దని సూచించింది.

అలాగే కనీస వేతనం అనేది ప్రతి ఐదేళ్లకోసారి సవరించాలని.. కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమనేది ప్రాథమిక హక్కంది. కనీస వేతన కోడ్ అమలుకు సంబంధించి.. కార్యాచరణ భద్రత, ఆరోగ్యం అంశంపై వారంలోగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించనుంది. దాని తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.

Posted in Uncategorized

Latest Updates