కాలబెట్టుడే.. వేరే దారిలేదంటున్న రైతులు

పంజాబ్ : కాలుష్యం పెరిగిపోతోందని.. పంట వ్యర్థాలు, గడ్డి కాల్చొద్దని.. తమపై ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు పంజాబ్ రైతులు. అధికారులు, ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను తప్పుపడుతున్నారు. అమృత్ సర్ లో మడికట్లలో ఉన్న గడ్డిని తగులబెట్టారు. కాల్చివేయడం తప్ప తమకు మరో దారి లేదంటున్నారు. ఈ పొగ కారణంగా గాలి ఖరాబ్ అవుతోందని అనడం సరికాదన్నారు.

పంట భూముల్లోని గడ్డిని కాల్చేస్తే టాక్సులు వసూలు చేస్తామని ప్రభుత్వ అధికారులు హెచ్చరించడంతో… రైతులకు మండుతోంది. గతంలో ఎన్నడూ లేనట్టు .. కొత్త కండిషన్లు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు రైతులు. గడ్డిని కాల్చినంత మాత్రాన పన్నులు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఎన్నో పరిశ్రమలు, వాహనాలే…. కాలుష్యానికి ప్రధాన కారణం అన్నారు. పొల్యూషన్ కు రైతులు కారణం అసలే కాదన్నారు.

Posted in Uncategorized

Latest Updates