కాలా సినిమాకి కొర్రీ : కర్నాటకలో రజనీకాంత్ బ్యాన్

రలలనలపొలిటికల్ ఎంట్రీ తర్వాత.. పార్టీ ప్రకటనకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ కు అంతరాష్ట్ర సమస్య వచ్చి పడింది. మరో వారంలో విడుదల అవుతున్న కాలా సినిమాను కన్నడీగులు బ్యాన్ చేశారు. కర్నాటకలో రజనీకాంత్ సినిమాలు ఆడనివ్వబోం అని హెచ్చరించారు కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్. కావేరి జల వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా.. కర్నాటకు వ్యతిరేకంగా మాట్లాడిన రజినీకాంత్ సినిమాను విడుదల చేయొద్దని కర్నాటక ధియేటర్ ఓనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్లకు పిలుపునిచ్చారు. కన్నడ ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని.. ఇప్పుడు రజనీకాంత్ సినిమా కాలా విడుదల చేస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా విడుదల కాకుండా చూడాలని కూడా కోరారు.

జూన్ 7వ తేదీ తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కాలా మూవీ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కర్నాటకలో బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ మొత్తంలో ఈ మూవీ అక్కడ అమ్ముడుపోయింది. ఇప్పుడు కావేరి జల వివాదం అంశాన్ని తెరపైకి తేవటంతో పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా – రాజీకీయాలు వేర్వేరని.. రెండింటికీ ముడిపెట్టొద్దని కోరుతున్నారు డిస్ట్రిబ్యూటర్ సౌరవ్

Posted in Uncategorized

Latest Updates