కాలిఫోర్నియాలో కార్చిచ్చు : 500 ఇండ్లు ధ్వంసం

గ్రీస్ లో కార్చిచ్చు అక్కడి ప్రజలను అతలాకుతులం చేయగా..ఇప్పుడు కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుకున్నది. దీంతో శనివారం (జూలై-28) నార్తర్న్ కాలిఫోర్నియాలో  500 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. అయిదు వేల మంది నిరాశ్రయులయ్యారు. దావానలం వల్ల దగ్ధమైన ఇండ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. షాష్టా కౌంటీలో మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. అక్కడ ఒక్కదగ్గరే  65 ఇండ్లు మంటల్లో దహనం అయ్యాయి. కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Posted in Uncategorized

Latest Updates