కాలుష్యానికి చెక్ : సిటీలో ఎలక్ట్రిక్ కార్లు

CARFకాలుష్యాన్ని అరికట్టేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది GHMC. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీలో  మొదటి సారిగా ఎలక్ట్రిక్‌ కార్లను అందుబాటులోకి తెస్తోంది. మొదటి విడతగా 20 కార్లను  ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ EESL నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుంది. వీటిని GHMC లోని అధికారుల కోసం వినియోగించనున్నారు. మొదటి దశలో క్షేత్రస్థాయి పర్యటనలు లేని, కార్యాలయ విధులకు మాత్రమే పరిమితమయ్యే అధికారులు వీటిని వినియోగించనున్నారు.

కార్ల పనితీరును బట్టి దశలవారీగా వీటి సంఖ్యను పెంచనున్నారు. భవిష్యత్‌ లో చెత్త తరలింపు స్వచ్ఛ ఆటోలనూ ఎలక్ట్రిక్‌వే తీసుకునే యోచనలో ఉన్నారు. ఈ కార్లను శుక్రవారం (జూన్-1) మంత్రి కేటీఆర్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రాం(యూఎన్‌ఈపీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోలేమ్‌ తో కలిసి ప్రారంభించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates