కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు: కేటీఆర్

ktrపెట్టుబడులు, ఉద్యోగావకాశాల వివరాలతో నివేదిక రూపొందించాలన్నారు మంత్రి కేటీఆర్‌. TSIIS ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. పారిశ్రామిక పార్కుల పనులు వేగవంతం చేయాలన్నారు. అన్ని పార్కుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. ఉప్పల్ ఎస్టేట్‌లో కార్యకలాపాలు నిలిపేసిన కంపెనీలతో పరిశ్రమల అధికారులతో భేటీ కావాలని సూచించారు. కాలుష్య కారక కంపెనీలను నగరం బయటకు తరలించే అంశం పరిశీలించాలన్నారు. దీనికోసం కాలుష్య కారక కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఐటీ లాంటి కాలుష్య రహిత ఇండస్ట్రీల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates