కాలు తగిలిందని… ఏమైందో తెలియదు… చంపేశాడు

allahabad-man-beaten-to-death_650x400_81518340957ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఒకరి కాలు మరొకరికి తగలిందని మొదలైన చిన్న గొడవ చివరికి ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అలహాబాద్‌లోని కాలికా రెస్టారెంట్‌లో శనివారం(ఫిబ్రవరి10) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దిలీప్‌ అనే లా స్టూడెంట్ తన స్నేహితులతో డిన్నర్‌ చేయడానికి కాలికా రెస్టారెంట్‌కు వెళ్లాడు. విజయ్‌ శంకర్‌ అనే వ్యక్తికి దిలీప్‌ కాలు తగిలిందన్న విషయంలో చిన్నగొడవ మెదలైంది. డిన్నర్‌ అనంతరం మళ్లీ వీరి మధ్య గొడవ జరగి రెస్టారెంట్‌ బయట కొట్టుకున్నారు. ఈ సమయంలో రెస్టారెంట్‌ వెయిటర్ మున్నా చౌహన్‌ ఐరన్‌ రాడ్‌తో దిలీప్‌పై దాడి చేశాడు. దీంతో అతను కుప్పుకూలిపోవడంతో వెంటనే బైక్‌పై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం(ఫిబ్రవరి11) దిలీస్ చనిపోయాడు. ఈ ఘటనంతా బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే ఆ రెస్టారెంట్‌ యజమాని పోలీసులకు డయల్‌ 100 ద్వారా సం‍ప్రదించగా దగ్గరల్లో ఉన్న గస్తీ వాహనం సమయానికి అక్కడకు చేరుకోలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయ్‌ శంకర్‌, మున్నాచౌహన్‌లను అదుపులోకి తీసుకున్నారు. సమయానికి అప్రమత్తం కానీ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేస్తూ చర్యలు తీసుకున్నారు. గొడవ దిలీప్‌-విజయ్‌ శంకర్‌కైతే వెయిటర్‌ ఎందుకొచ్చాడనేది పోలీసులకు అర్ధం కాలేదు. వెయిటర్‌ను విచారించగా కూరగాయలతో తీసుకొస్తున్న తనను దిలీప్‌ కొట్టడంతో ఆగ్రహానికి లోనై రాడ్‌తో దాడిచేసానని అతను తెలిపాడని పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates