కాల్చి పారేయండంటూ కామెంట్స్ : అడ్డంగా బుక్కైన కుమారస్వామి

కర్ణాటక సీఎం కుమారస్వామి అడ్డంగా బుక్కయ్యారు. JDS లీడర్ ప్రకాశ్ ను ఎవరో హత్య చేశారు. ఈ హత్య పై కుమారస్వామి ఎవరితోనో మాట్లాడుతూ.. సంచలన కామెంట్స్ చేశారు. ప్రకాశ్ చాలా మంచి వ్యక్తి అని, అతన్ని ఎందుకు చంపేశారో తెలియదని..చంపిన వాళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయండని ఎవరికో ఫోన్ లో చెప్పారు.

ఎలాంటి సమస్య  ఉండదు అన్నారు. కుమార స్వామి వాయిస్ అంతా కెమెరాలో రికార్డ్ అయింది. కెమెరాలో తన వాయిస్ రికార్డు కావడంతో… ప్లేట్ మార్చారు కుమార స్వామి. భావోద్వేగంతోనే అన్నట్టు… వివరణ ఇచ్చారు. అవి తన ఆదేశాలు కావని సర్ది చెప్పారు. కుమార స్వామి ఫోన్ కాల్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates