కాల్పులకు తెగబడ్డ పాక్..పోలీసులకు గాయాలు

POLICE DEARHఓ వైపు తెల్ల జెండా చూపిస్తూనే.. మరోవైపు కాల్పులకు తెగబడుతోంది పాకిస్థాన్. సరిహద్దు వెంట సోమవారం (మే-21) జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ తో పాటు.. ప్రజలు గాయపడ్డారు. ఆర్ పురా సెక్టార్ లోని ఆర్నియాలో ఉదయం నుంచి మోర్టార్లతో కాల్పులు జరుపుతోంది పాక్ సైన్యం. పాక్ కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ ను హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. పాక్ కాల్పుల నేపథ్యంలో ప్రజలెవరూ బయట తిరగొద్దన్నారు పోలీసులు. గాయపడిన వారు వెంటనే తమను సంప్రదించాలని.. వారిని తరలించేందుకు అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates