కాల్పులకు పాల్పడ్డ పాక్: ఇద్దరు జవాన్లు మృతి

సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు చనిపోగా… 14 మంది గాయపడ్డారు. భారత బలగాలు పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. అఖ్నూర్ సెక్టార్ లోని ప్రగ్వల్ ఏరియాలో జరిపిన కాల్పుల్లో BSF ASI సత్యనారాయణ్ యాదవ్, కానిస్టేబుల్ విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయారు. అమర జవాన్ల భౌతికకాయాలకు జమ్మూలో నివాళులర్పించిన అధికారులు… స్వస్థలాలకు పంపించారు. సైనిక వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు కుప్వారా జిల్లా కెరెన్ సెక్టార్ లో ఉగ్రచొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన ఒక ఉగ్రవాదిని కాల్చి చంపాయి.  పాక్ ఫైరింగ్ పై మండిపడ్డ జమ్మూ-కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ.. రెండు కొరియా దేశాలే కలిసిపోయాయి… భారత్-పాక్ ఎందుకు ఒకటి కాకూడదని ప్రశ్నించారు. దేశంలోని పార్టీలన్నీ కలిసి రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates