కాల్వలో పడ్డ బస్సు..తప్పిన ప్రమాదం

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాముల వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయాయ్యి. క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం (జూలై-22)ఉదయం హైదరాబాద్ నుండి 40 మంది ప్రయాణికులతో నర్సాపురం వెళ్తున్న ట్రావెల్ బస్సు.. వానపాముల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. ఈ ఘటనతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎవరికి వారే బస్సు అద్దాలు పగుల కొట్టి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రెవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రెవర్లు ఇద్దరు కనీసం రక్షణ కల్పించకుండా పరారు కావడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు బస్సులో ఉన్న ప్రయాణికులు అందరిని వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.

Posted in Uncategorized

Latest Updates