కాళేశ్వరంతో సిరిసిల్ల సస్యశ్యామలం : కేటీఆర్

KTఆరు నెలల్లో వేములవాడ, సిరిసిల్ల భూములకు కాళేశ్వరం నీరుతో సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. బుధవారం (జూన్-13) సిరిసిల్లలో అగ్రికల్చర్ కాలేజీకి శంకుస్థాపన చేశారు కేటీఆర్, పోచారం. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రైతులకు 5 లక్షల భీమా ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎంతో మంది ప్రధానులు వచ్చారని, ఎన్నో ప్రభుత్వాలు మారినా..కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన పథకాలు ఎవరూ తేలేదన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని, రైతుబంధుతో రైతులు వ్యవసాయంలో మునిగితేలుతున్నారని, ఇది ఎంతో సంతోషించతగిన విషయం అన్నారు. తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి చెందుతుండటంతో మన రాష్ట్రంతో CFTRI ఒప్పందం కుదుర్చుకోవడం గర్వంగా ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates