కాళేశ్వరంపై ఇప్పటికైనా కాంగ్రెస్ తీరు మారాలి : హరీశ్

HARISHకాళేశ్వరం  ప్రాజెక్టుకు  సంబంధించి  శుక్రవారం (ఫిబ్రవరి-23)న సుప్రీంకోర్టు  తీర్పుపై  హర్షం వ్యక్తంచేశారు  మంత్రి హరీష్ రావు.  ఢిల్లీలో వాదనలను  స్వయంగా  విన్న హరీష్.. తెలంగాణ  రైతాంగం న్యాయం,  ధర్మం  గెలిచిందన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టును  ఆపేందుకు  కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు  చేసిందన్నారు.  100 కేసులు  వేసిందని చెప్పారు.  కాంగ్రెస్ నేతలు  ఇప్పటికైనా  బుద్ధి తెచ్చుకోవాలన్నారు . పిటిషన్  వేసిందెవరో.. వాళ్లను నడిపిస్తున్నది  ఎవరో  త్వరలోనే  బయటపెడతామన్నారు.  కోటి ఎకరాలకు  నీరు అందించి..  ఆకుపచ్చ తెలంగాణ,  ఆత్మహత్యలు  లేని తెలంగాణ  చూడాలన్నదే  సీఎం కేసీఆర్  లక్ష్యమన్నారు. కోదండరాం,  కాంగ్రెస్ నేతలు  ప్రాజెక్టుల విషయంలో  తమ ఆలోచనలను  మార్చుకోవాలన్నారు.  సుప్రీం తీర్పును  స్వయంగా  ముఖ్యమంత్రికి ఫోన్  చేసి  తెలిపారు హరీష్ రావు.

Posted in Uncategorized

Latest Updates