కాళేశ్వరం తిప్పిపోతల పథకం.. జేఏసీ మీటింగ్ లో నేతలు

హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో “కాళేశ్వరం ఎత్తివేతల పథకం రీ ఇంజినీరింగ్- భారీ ఇంజినీరింగ్ తప్పిదం” పుస్తకావిష్కరణ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, ఐఏఎస్ ఆకునూరి మురళి,  సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం వేణుగోపాల్, తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు హాజరయ్యారు.

ప్రాణహిత చేవెళ్ల పథకంలో అక్రమాలు జరిగాయన్న కాగ్ రిపోర్ట్ ను సాకుగా చూపి కేసీఆర్ ప్రాజెక్టులను రీ- డిజైన్ చేశారని ప్రముఖులు అన్నారు. “రీడిజైనింగ్ పేరుతో ఆంధ్ర ప్రాంతం వారికి కాంట్రాక్ట్ లు ఇచ్చారు. రీ- డిజైనింగ్ పేరుతో డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40,000 కోట్ల ప్రజా ధనం  దుర్వినియోగం అవుతోంది. ఇది ఎత్తిపోతల పథకం కాదు తిప్పిపోతల పథకం” అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై లోతైన సమగ్ర విచారణ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ వచ్చిన తరువాత ఉద్యమ కారుల బాధ్యత పెరుగుతుందని జయశంకర్ సర్ ఎప్పుడూ చెప్పేవారని జేఏసీ చైర్మన్ రఘు అన్నారు. “ఎత్తిపోతల పథకాలపై శాస్త్రీయమైన చర్చ జరగాలి. బేసిక్ ఇంజినీరింగ్ ఫండమెంటల్ ను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులో మార్పులు  చేర్పులు చేస్తే రూ.20,000 కోట్లు ఆదా అవుతాయి. ఈ మీటింగ్ లో ప్రజస్వామ్య చర్చ జరిగింది” అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates