కాళేశ్వరం పర్యటనలో ఎమ్మెల్సీలు : షెడ్యూల్ ఇదే

KALeshwaamమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం (ఫిబ్రవరి-23) కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు ఎమ్మెల్సీలు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తామన్నారు ఎమ్మెల్సీలు. కాళేశ్వరం కింద చేపట్టిన ప్రాజెక్టులు, పంపుహౌస్ లను పరిశీలిస్తామని చెప్పారు. కాళేశ్వరానికి వెళ్లిన వారిలో TRS తోపాటు MIM , BJP సభ్యులున్నారు. 40మంది ఎమ్మెల్సీలు శుక్రవారం  ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని శాసనమండలి ప్రాంగణం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో బయలుదేరారు. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో కాళేశ్వరానికి అనుబంధంగా నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులను పరిశీలిస్తారు. ప్రతిష్టాత్మక కాలేశ్వం ప్రాజెక్టు పర్యటనకు కాంగ్రెస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

పర్యటన షెడ్యూల్

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రాష్ట్ర ఎమ్మెల్సీల బృందం శుక్ర, శనివారాల్లో పర్యటిస్తోంది. 23న  మధ్యాహ్నానికి భూపాలపల్లిలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం 3.30 కి మేడిగడ్డ బరాజ్ చేరుకొంటారు. సాయంత్రం గం. 5.15 కి కాళేశ్వరానికి సమీపంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శిస్తారు. రాత్రి కాళేశ్వరం సమీపంలోని హరిత గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. మర్నాడు ఉదయం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం సందర్శిస్తారు. ఆ తర్వాత అన్నారం బరాజ్, మధ్యాహ్నం సుందిళ్ల బరాజ్‌ను సందర్శిస్తారు. లంచ్ అనంతరం మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్సీలు.. గౌలివాడ వద్ద సుందిళ్ల పంప్‌హౌజ్‌ను సందర్శిస్తారు. సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ప్యాకేజ్-6, పంప్‌హౌస్, సర్జ్‌పూల్, టన్నెల్‌ను సందర్శిస్తారు. రాత్రి 8 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

Posted in Uncategorized

Latest Updates