కాళేశ్వరం ఫాస్ట్ గా పూర్తి చేసి రికార్డు సాధిస్తాం : హరీష్

HARISHఅతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పుతామని తెలిపారు మంత్రి హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. మేడిగడ్డ ఆనకట్ట వద్ద ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి.. ఆసియాలోనే రికార్డుగా నీటిపారుదల శాఖ తెలిపింది. దీంతో.. రికార్డు స్థాయిలో పనులు చేసినందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ, నీటిపారుదల శాఖ అధికార యంత్రాంగాన్ని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. మిగిలిన పనుల్లోనూ ఇదే పట్టుదల, వేగం కొనసాగించాలన్నారు. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పథకం పూర్తయితే సీఎం కేసీఆర్ కల సాకారం అవుతుందన్నారు. అన్ని శాఖలు, గుత్తేదారులు సమిష్టిగా పనిచేసి నిర్ణీత గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates