కాళేశ్వరం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు: హరీశ్

harish-raoపాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారన్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. గద్వాల నడిగడ్డ ప్రగతి సభలో హరీశ్ రావు మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లా పచ్చబడాలన్నదే సీఎం కేసీఆర్ కల అని అన్నారు. రూ.554 కోట్ల ఖర్చుతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గట్టు ఎత్తిపోతల ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు.

2002లో జూన్ 1న సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పాదయాత్రతో ఆర్‌డీఎస్‌పై పోరాటం చేశారన్నారు. రైతుల కోసం తాము పాదయాత్రలు చేస్తే..కాంగ్రెస్ నాయకులు మాత్రం ఢిల్లీ యాత్రలు చేశారన్నారు. 2014లో ప్రాజెక్టు మంజూరు అయిందంటూ ప్రజలను మభ్యపెట్టారు. చంద్రబాబు, వైఎస్ జిల్లా ప్రజలను మోసం చేశాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. కాళేశ్వరం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని…SRSPతో యాదాద్రి భువనగిరి, సూర్యాపేటకు నీళ్లిస్తామని..కృష్ణానీటితో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేస్తమని స్పష్టం చేశారు మంత్రి హరీశ్‌.

Posted in Uncategorized

Latest Updates