కాళేశ్వరం స్పెషల్ ప్యాకేజీ ..బస్సు యాత్ర ప్రారంభం

HARISH.jpg KALకాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం పర్యాటక బస్సును ఆదివారం (జూన్-3) జెండా ఊపి ప్రారంభించారు మంత్రులు హరీశ్ రావు, చందూలాల్. ఈయాత్ర కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది పర్యాటక శాఖ. హైద్రాబాద్ లోని హరీశ్ రావు ఇంటి దగ్గరి నుంచి బస్సు కాళేశ్వరానికి వెళ్లింది. పెద్దలకు రూ. 950, పిల్లలకు రూ. 750 ఛార్జీ. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రతి రోజు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచుతామని అధికారులు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టికెట్టు బుక్ చేసుకోచ్చన్నారు. పర్యటనలో భాగంగా రంగనాయకుల సాగర్, సుందిళ్ల బ్యారేజ్, అన్నారం పంప్‌హౌస్‌లను పర్యాటకులు సందర్శించనున్నారు. పర్యాటక హోటళ్లలో అల్పాహారం, భోజన వసతులు కల్పించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates