కాళేశ్వరం పనుల్లో మరో ఘనత

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనత సాధించింది. మేడిగడ్డలో నిర్మిస్తున్న బ్యారేజ్  పనుల కాంక్రీట్  వినియోగంలో సరికొత్త రికార్డ్ సృష్టించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం 8 గంటల వరకు 24 గంటల్లోనే 16 వేల 722 క్యూబిక్  మీటర్ల కాంక్రీట్ వేశారు.

గతంలో 7 వేల 212 క్యూబిక్  మీటర్ల మీద ఉన్న రికార్డును  మేడిగడ్డ బ్యారేజ్  ఇంజనీరింగ్  అధికారులు అధిగమించారు. ఇందుకోసం ఆధునాతన యంత్రాలను ఉపయోగించారు. 4875 మంది కార్మికులు 24 గంటల పాటు పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్  పనులు కొంతకాలంగా నెమ్మదించాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండో రోజే పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు కేసీఆర్ .

మేడిగడ్డ బ్యారేజ్  పనుల్లో జాప్యంపై అధికారులను మందలించారు. నిర్మాణాల్లో  వేగం పెంచాలని ఆదేశించారు. క్షేత్రస్త్థాయి పరిశీలనకు వస్తానని ముఖ్యమంత్రి చెప్పడంతో.. నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచారు అధికారులు. ఈ క్రమంలోనే 16 వేల 722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి రికార్డ్ నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates