కావాల్సింది స్పీచ్ లు కాదు.. ఉద్యోగాలు: రాహుల్ గాంధీ

658735-rahulమోడీ లోక్ సభలో ప్రధాని అన్న విషయాన్ని మరచిపోయి మాట్లాడారని కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ విమర్శించారు. గంట ప్రసంగంలో ఎక్కడా ముఖ్య విషయాలు మోడీ మాట్లాడలేదని రాహుల్ విమర్శించారు. ప్రస్తుతం కావాల్సింది ఉద్యోగాలని, స్పీచ్ లు కాదని రాహుల్ తెలిపారు. ప్రధాని స్పీచ్ పొలిటికల్ స్పీచ్ లా ఉందని రాహుల్ తెలిపారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఎక్కడా బిజెపి చేసిన పనులను గురించి చెప్పకుండా కాంగ్రెస్ నే విమర్శించారన్నారు ఖర్గే. ప్రధాని ప్రసంగంలో కొత్తేమి  లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates