కావేరి ఎక్స్ ప్రెస్ ఢీకొని..ఇద్దరు రైల్వే కార్మికులు మృతి

పట్టాలపై పని చేస్తున్న సమయంలో రైలు ఢీకొని ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన  ఇవాళ తెల్లవారుజామున కర్ణాటక బార్డర్ గుడిపల్లి-బంగారంపేట దగ్గర జరిగింది. పట్టాలను ఇద్దరు కార్మికులు తనిఖీ చేస్తుండగా.. వారిని కావేరీ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. మృతుల్లో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి. బండపల్లికి చెందిన కార్మికుడు, మహారాష్ట్రకు చెందిన మరో కార్మికుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం హస్పిటల్ కి తరలించారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన పోలీసులు..దట్టమైన మంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates