కావేరీ జలాలను అన్ని రాష్ట్రాలకు అందిస్తాం: సీఎం కేసీఆర్

kcr-deva-foudaదేశంలో నీరు సమృద్ధిగా ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. జనతాదళ్(సెక్యులర్) అధినేత హెచ్‌డీ దేవెగౌడతో కేసీఆర్ భేటీ ముగిసింది. తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. అయ్యారు. దేశం ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి  కాంగ్రెస్, బీజేపీ పార్టీలే  కారణమన్నారు సీఎం కేసీఆర్. పాలన విషయంలో తెలంగాణలో మేం సక్సెస్ అయ్యామన్నారు. తాము చెబుతున్నఫెడరల్ ఫ్రంట్ దేశంలో సామాన్యుడి ఫ్రంట్ అని కేసీఆర్ ఆన్నారు. కావేరీ జల వివాదం ఈ రోజుది కాదని…దేశంలో నీటికి కొరత లేదన్నారు. నీటికి కర్ణాటకకే కాదు, తమిళనాడుకే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకీ అందిస్తామన్నారు. జల వివాదాలను పరిష్కరించకుండా కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు.  ప్రకాశ్ రాజ్ తనకు మంచి మిత్రుడని చెప్పిన కేసీఆర్ ఆయన సమాజం కోసం సేవ చేస్తున్నారని ప్రశంసించారు.

తెలంగాణలో కేసీఆర్ మంచి పాలన అందిస్తున్నారన్నారు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ. రైతులు, మహిళలు, పేద ప్రజలకు పథకాలు ప్రవేశపెట్టి… దేశంలో నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ ఉన్నారన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వాలున్నా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదన్నారు. దేశంలో నీటి సమస్యలకు కేసీఆర్ దగ్గర మంచి ప్రణాళికలున్నాయన్నారు దేవెగౌడ. దేశంలోని రైతులు, బడుగుబలహీన వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ స్థాపించారన్నారు దేవెగౌడ. దానిపై తామిద్దరం చర్చించినట్టు చెప్పారు.

బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చించారు. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

Posted in Uncategorized

Latest Updates