కావేరీ నదీ జలాల వివాదం..సుప్రీం కీలక తీర్పు

kaveriకావేరీ నదీ జలాల వివాదంలో కర్నాటకకు ఊరట లభించింది. కావేరీ నదీ జలాల వివాదంపై శుక్రవారం (ఫఇబ్రవరి-16) సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తమిళనాడుకు 177 టీఎంసీలు ఇవ్వాలని కర్నాటకకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించి 2007లో 192 టీఎంసీలు తమిళనాడు వాటాగా చెబుతూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కావేరీ నదీ జలాల పంపిణీపై తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కొత్తగా తమిళనాడు వాటాను 177 టీఎంసీలకు తగ్గిస్తూ ఇవాళ తీర్పును వెలువరించింది.

Posted in Uncategorized

Latest Updates