కావేరీ వివాదం : కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్

KAVERIకావేరీ నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కావేరి జలాలపై తమ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. బెంగళూరు నీటి ఎద్దడి తీర్చేందుకు కర్ణాటకకు కాస్త ఎక్కువ మొత్తంలో నీళ్లు ఇవ్వాలని గత విచారణలో కోర్టు ఆదేశించింది. దీనిపై తమిళనాడులో ఇప్పటికీ నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కావేరీ బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది.

ఇదే సమయంలో సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీరును తప్పుబట్టింది. కావేరీ నదీ జలాల పంపిణీని ఎలా చేపట్టాలన్నదానిపై ఓ విధానాన్ని రూపొందించాలని ఆదేశించింది. మే 3న దీనిపై తిరిగి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కావేరీ అంశంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించింది. కొన్ని దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల‌ మధ్య కావేరీ విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ముందు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ ఎన్నికల ఉన్నందునే తమకు మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది కేంద్రం. దీంతో కోర్టు మే 3 వరకు గడువిచ్చింది.

Posted in Uncategorized

Latest Updates