కాశీలో కొత్త రూల్: అంత్యక్రియలు కావాలంటే ఆధార్ తప్పనిసరి

KAASHIఆధార్‌ మీద ప్రజలకున్న అనుమానాలు తీరకముందే మరో కొత్త ప్రతిపాదన తెర మీదకొచ్చింది. గంగానది తీరంలో ఉన్న మణికర్ణిక ఘాట్‌, హరిశ్చంద్ర ఘాట్‌లలో అంత్య క్రియలు నిర్వహించాలంటే మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డును బంధువులు తప్పనిసరిగా చూపించాలంటున్నారు వారణాసిలోని జాతీయ విప‌త్తు ద‌ళ ఉద్యోగులు(NDRF). ఈ కొత్త నిబంధనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. హిందూవుల విశ్వాసం ప్రకారం కాశీలో అంత్య క్రియలు చేస్తే పుణ్యం అనే నమ్మకంతో చాలా మంది ఇక్క‌డికి వస్తుంటారు. కానీ ఇప్పుడు తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో  ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

ఈ రూల్ ను తీసుకురావడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు ఘాట్‌ నిర్వహకులు. కొంతకాలంగా ‘సుధాన్షు మెహతా’ ఫౌండేషన్‌కు చెందిన వ్యక్తులు మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. దానిలో భాగంగా 2015లో మొత్తం 4 కార్పస్‌ ‘మోటర్‌ క్యారియర్‌ బోట్ల’ను ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వారిని తీసుకువచ్చి రహస్యంగా ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలుపుతున్నారు సంస్థ సభ్యులు.

Posted in Uncategorized

Latest Updates