కాశ్మీర్ లో కాల్పుల కల్లోలం : బాలిక, ఇద్దరు యువకులు మృతి

kashmir1కాశ్మీర్ మళ్లీ రగులుతోంది. యుద్ధ వాతావారణమే నెలకొంది. ఓ వైపు ఆందోళనకారుల రాళ్ల దాడి – మరో వైపు నుంచి భద్రతా బలగాల కాల్పులతో దద్దరిల్లుతోంది. జూన్ 6వ తేదీ శుక్రవారం అర్థరాత్రి సౌత్ కాశ్మీర్ కుల్గాం ఏరియాలోని రెడ్వానీలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో.. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. వేలాది మంది భద్రతా సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లోని స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తనిఖీలకు అనుమతి ఇచ్చేది లేదని వాదనకు దిగారు. కొందరు యువకులురాళ్ల దాడికి దిగారు.

పెద్ద ఎత్తున యువత రాళ్లతో దాడికి దిగటంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొంత సమయం సంయమనం పాటించిన భద్రతా బలగాలు.. పరిస్థితి కంట్రోల్ లోకి రాకపోవటంతో ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఓ వైపు నుంచి రాళ్లు.. మరో వైపు బుల్లెట్లు.. ఈ దాడిలో కుల్గామ్ ప్రాంతంలోని హవోరాకి చెందిన 16 ఏళ్ల బాలిక అలీబ్ చనిపోయింది. 22 ఏళ్ల షకీర్ అహ్మద్, 20 ఏళ్ల ఇర్షాద్ మజీద్ కూడా చనిపోయాడు. మరో 10 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి మృతితో ఇతర సంఘాలు, స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావటంతో హైటెన్షన్ నెలకొంది.

ముగ్గురు యువకుల చనిపోయారన్న సమాచారంతో మిగతా ప్రాంతాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. పుల్వామా, అనంతనాగ్, షోపియన్ ప్రాంతాల్లో భద్రతా బలగాలపై రాళ్ల దాడులతో విరుచుకుపడుతున్నారు. పరిస్థితిపై గవర్నర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు బలగాలను ఆయా ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates