ఇవాళ మమత బెనర్జీతో కేసీఆర్ సమావేశం

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా గులాబీ బాస్….KCR రాష్ట్రాల పర్యటన కొనసాగుతోంది. ఆదివారం భువనేశ్వర్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసిన CM…రాత్రి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే బస చేశారు. కాసేపట్లో  రోడ్డు మార్గంలో వెళ్లి కోణార్క్, పూరి జగన్నాథ్ ఆలయాలను దర్శించుకోనున్నారు.

మధ్యాహ్నం కోల్ కతా వెళ్లనున్న KCR….సాయంత్రం పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఆక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు. డిసెంబర్- 25 నుంచి రెండు, మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు గులాబీ బాస్. ప్రధాని మోడీని మర్యాద పూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ భేటీ అవుతారు. యూపీ మాజీ CMలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ తో కూడా భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు KCR.

Posted in Uncategorized

Latest Updates