కాసేపట్లో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం.. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ గులాబీ వనంగా మారింది. పార్టీ కార్యవర్గ సమావేశానికి నాయకులు తరలిరావడంతో… హడావుడి పెరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, 20 మంది జనరల్ సెక్రటరీలు, ఒక పొలిటికల్ సెక్రటరీ, 12 మంది జాయింట్ సెక్రటరీలు, 33 మంది సెక్రటరీలు హాజరవుతున్నారు.  టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు  68 మంది కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. 8 మంది వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు రానున్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్ ను ఇప్పటికే కేసీఆర్ నియమించారు. కేసీఆర్ కు అభినందనలు తెలిపేందుకు ప్రముఖులు ప్రగతి భవన్ కు క్యూ కట్టారు. క్యాంప్ ఆఫీస్ లో కేటీఆర్ ను కలిసి విషెస్ అందించారు.

Posted in Uncategorized

Latest Updates