కాసేపట్లో బిగ్ ఫైట్ : హైదరాబాద్ అదరగొట్టాలని ఫ్యాన్స్ పూజలు

sun
IPL సీజన్ -11 క్లైమాక్స్ కి చేరింది. ఆదివారం (మే-27) ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నైతో జరగనున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలవాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. ఎలాంటి అంచనాలు లేవు. అందులోనూ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ లేడు. దీంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ కి రావడమే గగనం అనుకున్నారు. అయితే బౌలింగ్ తో మ్యాజిక్ చేసిన రైజర్స్ అందరి అంచనాలను తలకిందులు చేసి, ఫైనల్ కి చేరింది. దీంతో ఈ మ్యాచ్ గెలిచి కప్ తో హైదరాబాద్ కి రావాలని కొన్నిచోట్ల పూజలు చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులతో SRHకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.

మండు వేసవిలో క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించింది IPL. 60 మ్యాచ్‌ ల మహాసంగ్రామంలో ఆఖరి మ్యాచ్ కూడా మళ్లీ వాంఖడే మైదానం ఆతిథ్యమివ్వబోతోంది. ఇప్పటి వరకు 149 మంది ఆటగాళ్లు ఎన్నో మైళ్లు ప్రయాణించి..10 వేదికల్లో మ్యాచ్‌లు ఆడారు. శుక్రవారంతో టోర్నీలో 59వ మ్యాచ్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పటిష్ఠ బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నైకి.. భయంకరమైన బౌలింగ్  కలిగిన హైదరాబాద్ మధ్య జరిగే ఆసక్తికర పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు IPL నిర్వాహకులు.

Posted in Uncategorized

Latest Updates