కాస్టింగ్ కౌచ్ కొత్త కాదు : శ్రీరెడ్డి నిరసన పక్కదారి పట్టింది

NAGAమా అసొసియేషన్ మెంబర్స్ కోసం పనిచేస్తోందని, ఎవరికైతే ఇష్యూస్ ఉంటే న్యాయం జరిగేలా చూస్తుందన్నారు సినీ నటుడు నాగబాబు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం (ఏప్రిల్-18) మీడియాతో మాట్లాడిన నాగబాబు..మా అసొసియేషన్ లో ఎవరికి ఇబ్బందులు ఉన్నా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కొంతమంది చేస్తున్న నిరసనలు పక్కదారి పడుతున్నాయని, పవన్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. మా అసిసియేషన్ లో ఏమన్నా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లవచ్చని తెలిపిన నాగబాబు..అవగాహన లేనివారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇండస్ట్రీలో ఎవరిపైన అయినా వేధింపులు జరిపితే మా అసొసియేషన్ కు ఫిర్యాదు చేస్తే..వెంటనే న్యాయం చేస్తామన్నారు.

శ్రీరెడ్డి నిరసన పక్కదారి పట్టిందన్నారు. కాస్టింగ్ కౌచ్ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసని..కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పుడే తెలిసిందా అన్నారు. ఇండస్ట్రీలో దేవుళ్లెవరూ ఉండరని, ఎవరైనా తక్కువగా మాట్లాడితే లాగిపెట్టి కొట్టాలని చెప్పారు. ఆర్టిస్టులకు ఫిక్స్ డ్ రేట్స్ లేవని, ఈ విషయంపై నిర్మాతలతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. తెలుగు వారికే క్యారెక్టర్ ఇవ్వాలనేది..సినిమా అవసరంబట్టి అది నిర్మాతల చేతుల్లో ఉంటుందన్నారు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు..సో ఇది కుదరది ఎవరి ట్యాలెంట్ వారిదేనని, మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా పనిచేసే హక్కు ఉందన్నారు. దేశంలో ఎవరి ఛాన్స్ వారిదేనని స్పష్టం చేశారు నాగబాబు.

పొలిటికల్ విషయంలో పవన్ తప్పు చేస్తే విమర్శించండి..అంతేకానీ పర్సనల్ గా కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పవన్ దీనిపై స్పందించలేదంటే చేతకాని పని అనుకోవద్దన్నారు. శ్రీరెడ్డి విషయంలో పవన్ మాట్లాడింది తప్పేముందన్నారు. దయచేసి తప్పుగా మాట్లాడద్దని, తమ తల్లిని అన్నందుకు మెగా ఫ్యామిలీ రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నారు. శ్రీరెడ్డి ఆడపిల్ల కావడంతో వదిలేస్తున్నామన్నారు నాగబాబు. ఇదే విషయంపై మా అమ్మ ఈ ఇష్యూని పెద్ద చేయవద్దని చెప్పిందన్నారు. ఈ విషయంపై మీడియాలో డిస్కషన్స్ పెట్టొదని రిక్వెస్ట్ చేశారు నాగబాబు.

Posted in Uncategorized

Latest Updates