కాస్ట్లీ క్రిమినల్ : విమానంలో వచ్చి చంపి వెళ్లాడు

neeraj ఇటీవల కాలలంలో వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని భర్తలను భర్యలే చంపుతున్నకేసులు ఇటీవల కాలలంలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నగరానికి చెందిన ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపేసిన ఘటన నగరంలో కలకలం రేపుతుంది. బీహార్ కు చెందిన జయమంగళ్ రాజ్ అతని భార్య మాలతీదేవి కొంతకాలంగా నగరంలో నివసిస్తున్నారు. కొంతకాలంగా మాలతీదేవి తన దగ్గర బంధువు నీరజ్ కుమార్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జయమంగళ్ రాజ్ ఇటువంటి పనులు చేయవద్దంటూ భార్యను హెచ్చరించాడు. ఎలాగైనా తన భర్తను చంపి ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించాలని మాలతీదేవి ఫ్లాన్ చేసింది. వెంటనే పాట్నాలో ఉన్న తన ప్రియుడికి ఫోన్ చేయడంతో జనవరి 31న అతడు విమానంలో హైదరాబాద్ వచ్చాడు.

ఫ్లాన్ ప్రకారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో మాలతీదేవి, తన ప్రియుడుతో కలసి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి తన భర్తను హత్య చేసింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లెటర్ రాసి భర్త మృతదేహం దగ్గర పెట్టాడు. తిరిగి విమానంలో పాట్నా వెళ్లిపోయాడు మాలతీ దేవి ప్రియుడు. సూసైడ్ లెటర్ ఉన్నప్పటికీ.. ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. పోస్టుమార్టం నివేదిక కూడా హత్య అని తేల్చటంతో పరారీలో ఉన్న మాలతీదేవిని పోలీసులు గురువారం(ఫిబ్రవరి8) సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసినట్లు మాలతీదేవి తెలపడంతో నీరజ్‌కుమార్‌ కోసం బిహార్‌కు ప్రత్యేక బృందాన్ని పంపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates